E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

గురువారం

24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX74,055-0.32%
NIFTY23,199-0.63%
హైదరాబాద్ 22K₹1,42,056/10g-1.57%
హైదరాబాద్ 24K₹1,54,970/10g-1.57%
వెండి₹2,14,541/kg-2.10%

తాజా వార్తలు

అలరించిన ‘జవహర్ సినీ గాన లహరి’ ఏఎన్నార్ జయంతి సందర్భంగా సినీ సంగీత విభావరి

The 17th season of Jawahar Cine Gana Lahari musical concert was grandly held at Thyagaraya Gana Sabha to mark ANR's birth anniversary.

nagendra24 September 2026, 5:13 AM1 చూసులుtrinetnews.com
అలరించిన ‘జవహర్ సినీ గాన లహరి’  ఏఎన్నార్ జయంతి సందర్భంగా సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని ‘జవహర్ సినీ గాన లహరి–సీజన్ 17’ సంగీత కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఉన్న కళా లలితకళా వేదిక ఈ సంగీత విభావరికి వేదికైంది.

గాయకుడు, నిర్వాహకుడు దోళా జవహర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అలనాటి, నేటి మధురమైన సినీ గీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. సంగీతాభిమానుల కరతాళధ్వనుల మధ్య కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సిటీ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ అంజనీదేవి హాజరయ్యారు. మరో ముఖ్య అతిథిగా కళాకారుడు, స్వరకిన్నెర శారదా పురస్కార గ్రహీత డాక్టర్ త్రినాథరావు పాల్గొన్నారు. మల్లాది ఉష కరావోకే సంగీత సహకారం అందించారు.

సినీ సంగీతం ద్వారా అక్కినేని నాగేశ్వరరావుకు ఘన నివాళి అర్పించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ఈ సంగీత కార్యక్రమంలో కళాకారులు, గాయకులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి