Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Janaki Has Left an Indelible Mark on Cinema: Telangana Planning Board Vice-Chairman Chinna Reddy

The 'Sealwell Cine Suswaralu - 89' event was held at Thyagaraya Gana Sabha, honoring legendary playback singers with the S. Janaki Inspiration Awards.

nagendra19 August 2026, 3:35 PM10 व्यूtrinetnews.com
Janaki Has Left an Indelible Mark on Cinema: Telangana Planning Board Vice-Chairman Chinna Reddy

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 19 : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆర్.ఆర్.ఫౌండేషన్, సీల్‌వెల్ కార్పొరేషన్, శృతిలయ ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో "సీల్‌వెల్ సినీ సుస్వరాలు - 89" కార్యక్రమాన్ని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినీ చిత్ర పరిశ్రమలో జానకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆమని నిర్వహణలో "కలైమామణి జానకమ్మ స్వీట్ మెమోరీస్" శీర్షికతో ప్రత్యేక సంగీత విభావరిలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. అనంతరం గత 50 సంవత్సరాలుగా తమ స్వరంతో, పాటలతో సినీ రంగాన్ని అలరించిన సినీ నేపథ్య గాయనీ గాయకులకు "ఎస్. జానకి స్ఫూర్తి పురస్కారాలు అందజేశారు.

కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు విజయలక్ష్మి శర్మ, నింబమూరి కృష్ణ, వేణు శ్రీరంగం, చింతలపల్లి శ్రీధరాచార్యులు, యాంకర్ వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →