రవీంద్ర భారతి , ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 6:
గోవా రాష్ట్రంలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని గోవా ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు జగన్ బాబు గంజి, ప్రధాన కార్యదర్శి అశోక్ కంటే లు హర్షం వ్యక్తం చేశారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన వారధి, కవి సమ్మేళనం వంటి వివిధ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. గోవాలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చెయ్యాలని
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కు మే నెలలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. దానికి గవర్నర్ అశోక్ గజపతి రాజు ఆమోద ముద్ర వేసి రెవిన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్ బాబు గంజి , అశోక్ కంటే లు
మాట్లాడుతూ, తెలుగు అంతర్జాతీయ కేంద్రం
తెలుగు భాషను ప్రోత్సహించడంతో పాటు, గోవాలో సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన
గోవా గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులందరికీ జగన్‌బాబు గంజి, అశోక్ కంటే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దేశం నలుమూలలా విదేశాల్లో ఉన్న తెలుగు వారు
ఈ ప్రాజెక్టులో పాల్గొని, తమ ఆలోచనలు, భాగస్వామ్యం అందించి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షులు జగన్‌బాబు గంజి, కార్యదర్శి అశోక్ కంటే లు గోవా లో తెలుగు అంతర్జాతీయ కేంద్రం కోసం విశేష చేసినందుకుగాను పలువురు తెలుగు మేధావులు అభినందించారు.





