తార్నాక, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31 : దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం రూపొందించిన దివ్యాంగుల హక్కుల చట్టం-2016పై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను కలిసి, ఓయూ ఆర్ట్స్ కళాశాలలో చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలపై తగిన అవగాహన లేకపోవడంతో అనేక సందర్భాల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు తెలిపారు. సమాజంలో చట్టంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా దివ్యాంగుల హక్కులను మరింత సమర్థంగా పరిరక్షించవచ్చన్నారు. ఫోరం విజ్ఞప్తిపై ఓయూ రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించి, చట్టం-2016పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫోరం ప్రతినిధులు దివ్యాంగుల హక్కుల చట్టం-2016 పుస్తకాన్ని రిజిస్ట్రార్‌కు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి.. * ఓయూ రిజిస్ట్రార్‌ను కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం..
The Universities Differently-Abled Forum urged the Osmania University Registrar to organize a special awareness seminar on the Rights of Persons with Disabilities Act-2016.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి..

హెచ్ఎంటీ నగర్ పెద్దచెరువు వద్ద దెబ్బతిన్న మ్యాన్ హోల్స్ కు మరమ్మత్తులు..

BRS leaders urge officials to resolve drainage backup issues caused by damaged manholes near HMT Nagar Pedda Cheruvu.
మిగతా చదవండి →డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమతి నూతన కన్వీనర్‌గా శ్రీ తాడూరి గగన్ కుమార్ ఏన్నిక.

Taduri Gagan Kumar has been unanimously elected as the new convener for the Dr. A.S. Rao Nagar Division Ganesh Utsav Samithi.
మిగతా చదవండి →శక్తి స్కీమ్ రద్దు చేయాలని పోస్ట్‌కార్డుల ఉద్యమం

BRSV leaders and polytechnic students staged a postcard protest in Suryapet, demanding the immediate revocation of the Shakti Scheme.
మిగతా చదవండి →