Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Latest News

Hoist the National Flag and Display Patriotism: BJP Leader Menda Anil

BJP OBC Morcha state executive member Menda Anil Kumar Yadav called upon citizens to hoist the national flag on every home to showcase patriotism.

nagendra15 August 2026, 3:58 AM4 व्यूtrinetnews.com
Hoist the National Flag and Display Patriotism: BJP Leader Menda Anil

Share this story

Share link keeps your language (?lang=)

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెండె అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

హాలియా పట్టణంలోని త్రివేణి ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని, ప్రతి కుటుంబం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని అన్నారు.

ప్రతి విద్యార్థి తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల తన గౌరవాన్ని, దేశభక్తిని చాటాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జూలకంటి చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు *నంద్యాల ప్రవీణ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బైరబోయిన శంకర్, అనుముల మండల అధ్యక్షుడు రామంజీ, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు, అధ్యాపకులు అశోక్, శ్రీను*, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →