E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:11 pm

బుధవారం

23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:11 pm

SENSEX74,529+0.26%
NIFTY23,329+0.48%
హైదరాబాద్ 22K₹1,43,915/10g-0.33%
హైదరాబాద్ 24K₹1,56,998/10g-0.33%
వెండి₹2,23,754/kg+2.98%

తాజా వార్తలు

ఫాస్ట్ ట్రాక్ లో 22-ఏ పరిష్కారం* ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు 118 జీవో ప్ర‌కారం 19నుంచి రెగ్యుల‌రైజేష‌న్‌

Revenue Minister Ponguleti Srinivas Reddy announced a high-level committee to fast-track 22-A issues and the start of regularization under GO 118 in L.B. Nagar.

nagendra19 September 2026, 2:29 AM1 చూసులుtrinetnews.com
ఫాస్ట్ ట్రాక్ లో 22-ఏ పరిష్కారం* ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు  118 జీవో ప్ర‌కారం 19నుంచి రెగ్యుల‌రైజేష‌న్‌

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-ఏ కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం నాడు శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం. 564 ను , జారీచేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి చైర్మన్ గా సీసీఎల్ఏ డి.ఎస్. లోకేష్ కుమార్ వ్యవహరిస్తారు. లా సెక్రటరీ, పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటు స‌భ్యులుగా ఆనాడు ఎల్ బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు కాల‌నీల్లో ఉన్న రెగ్యుల‌రైజేష‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు రంగారెడ్డి జిల్లాలోని ఎల్.బి. నగర్ నియోజకవర్గంలో 118 జీ.ఓ. ప్రకారం 9,700 ప్లాట్ల రేగ్యులరైజేషన్ కు సంబంధించిన మెమోను శుక్ర‌వారం నాడు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ జీ.ఓ. ప్రకారం ఆ ప్రాంతంలో రేపటి నుంచి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. దశాబ్దాల కాలంగా అక్కడ ప్లాట్లు తీసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్న ఇండ్ల యజమానులు 118 జీ.ఓ. ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్ధ‌లాల రెగ్యుల‌రైజేష‌న్‌కు సంబంధించి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో జీవో 76ను జారీ చేశార‌ని ఆ జీవోను అనుస‌రించి శ‌నివారం నాడు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆధ్వ‌ర్యంలో సింగ‌రేణి ప్రాంత ఎమ్మెల్యేల‌తో స‌మావేశం నిర్వ‌హించి రెగ్యుల‌రైజేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

అలాగే రెవెన్యూ రికార్డుల‌లో 22ఎలో ఉండి హెచ్ఎండీఏ,

డీటీసీపీ, ,జిహెచ్ఎంసీ అనుమ‌తుల‌తో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఎ నుంచి తొల‌గించే విష‌యంలో ఒక‌టి రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించిన 10-12 అంశాల‌పై నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే నిర్ణ‌యం తీసుకొని 22ఎ ద‌ర‌ఖాస్తుదారులకు ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తామ‌ని స‌భ‌లో మంత్రి ప్ర‌క‌టించారు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్): శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (

మిగతా చదవండి →

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం నవరాత్రోత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ట్రైనెట్ న్యూస్): ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థా

మిగతా చదవండి →

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద

మిగతా చదవండి →

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా నిర్మాణాలు * స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌తో విమానాశ్ర‌యాల ప‌నులు చేప‌ట్టాలి... * శాఖ‌ల మ‌ధ్య స‌మన్వ‌యంతోనే ప‌నులు వేగ‌వంతం * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

మిగతా చదవండి →