ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,270/10g+3.61%
హైదరాబాద్ 24K₹1,67,204/10g+3.61%
వెండి₹2,24,662/kg-0.30%

తాజా వార్తలు

Heeradhi Cricket Club Wins HCA C Division One-Day League Final

Heeradhi Cricket Club clinched a 17-run victory over M.L. Jaisimha Cricket Club in the HCA C Division One-Day League championship match, powered by B. Vijay Gautam Reddy's all-round performance.

nagendra21 August 2026, 8:36 PM3 చూసులుtrinetnews.com
Heeradhi Cricket Club Wins HCA C Division One-Day League Final

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 21: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో హీరాధి క్రికెట్ క్లబ్ మరియు ఎం.ఎల్. జైసింహ క్రికెట్ క్లబ్ తలపడ్డాయి.

బి. విజయ్ గౌతమ్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్‌తో 62 పరుగులు చేయడంతో పాటు 1 వికెట్ తీసుకుని, హీరాధి క్రికెట్ క్లబ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన హీరాధి క్రికెట్ క్లబ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇందులో బి. విజయ్ గౌతమ్ రెడ్డి 71 బంతుల్లో 62 పరుగులు (5 ఫోర్లు), ఎం. నాగ మాన్విక్ 81 బంతుల్లో 46 పరుగులు (7 ఫోర్లు), ఎస్. ఆదిత్య దాస్ 55 బంతుల్లో 38 పరుగులు (5 ఫోర్లు) చేశారు.

227 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎం.ఎల్. జైసింహ క్రికెట్ క్లబ్ 49.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో హీరాధి క్రికెట్ క్లబ్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

హీరాధి క్రికెట్ క్లబ్ కార్యదర్శి శ్రీ మహేందర్ గౌడ్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, జట్టు సమష్టి కృషిని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి