హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 26:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో హీరాధి సి.సి., రాజు క్రికెట్ అకాడమీ జట్లు తలపడ్డాయి.
శివ ఆదిత్య దాస్ గుప్తా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హీరాధి సి.సి. 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హీరాధి సి.సి. 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. శివ ఆదిత్య దాస్ గుప్తా 66 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118 పరుగులు చేయగా, రిషి రాథోడ్ రామావత్ 71 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు, అక్షజ్ గౌడి 20 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేశారు.
260 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజు క్రికెట్ అకాడమీ 33 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 83 పరుగులు మాత్రమే చేసింది. అక్షజ్ గౌడి 6 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శివ ఆదిత్య దాస్ గుప్తా 5 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు.
హీరాధి క్రికెట్ క్లబ్ కార్యదర్శి శ్రీ మహేందర్ గౌడ్ జట్టు సమష్టి కృషిని అభినందిస్తూ, ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.





