E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

గురువారం

24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX74,075-0.30%
NIFTY23,209-0.59%
హైదరాబాద్ 22K₹1,42,111/10g-1.53%
హైదరాబాద్ 24K₹1,55,030/10g-1.53%
వెండి₹2,14,968/kg-1.91%

తాజా వార్తలు

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

With heavy rains forecast for the next two days, Revenue Minister Ponguleti Srinivas Reddy has ordered district collectors under red alert to step up vigilance and relief measures.

nagendra24 September 2026, 4:11 AM0 చూసులుtrinetnews.com
అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి    రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

రెడ్ అలర్ట్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

సెప్టెంబర్ 23: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి