E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:12 pm

మంగళవారం

22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:12 pm

SENSEX74,529+0.26%
NIFTY23,329+0.48%
హైదరాబాద్ 22K₹1,43,635/10g-0.52%
హైదరాబాద్ 24K₹1,56,693/10g-0.52%
వెండి₹2,20,253/kg+1.37%

తాజా వార్తలు

రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

State Health Minister Damodar Rajanarsimha visited RIMS Hospital to review rescue operations following a fire mishap in the SNCU.

nagendra22 September 2026, 11:26 AM0 చూసులుtrinetnews.com
రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: ఆదిలాబాద్‌ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్‌(సీఎన్సీయూ )లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు.

అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ, రిలీఫ్‌ చర్యలను మంత్రి పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.

శిశువులు, పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం మానిటర్‌ చేయాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. పిల్లల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్పిటల్‌లో ఫైర్‌ సేఫ్టీ, ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, ఇతర అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,22.మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సుడిగాలి పర్యటన చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా డివిజన్ లోన

మిగతా చదవండి →

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత తల్లిలా ప

మిగతా చదవండి →

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు* మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. 2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థియేటర్లలో హౌస

మిగతా చదవండి →