ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:34 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:34 pm

SENSEX77,680+0.18%
NIFTY24,283+0.21%
హైదరాబాద్ 22K₹1,53,618/10g+1.42%
హైదరాబాద్ 24K₹1,67,583/10g+1.42%
వెండి₹2,27,726/kg-1.04%

తాజా వార్తలు

పూల చేతులు (కవిత) తంగెళ్లపల్లి కనకాచారి

A poetic piece reflecting on nature, urban growth, resistance, and the inevitability of generational change.

nagendra26 August 2026, 2:46 AM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

---

అడవులు విధ్వంసం అయ్యాక...

తగలపడ్డాక..

ఇక్కడ నగరంలో మొలకెత్తుతున్నాయి..

తరలివచ్చిన వసంతాన్ని కాపు కాసి పెంచుతున్న తోటమాలలు ఇక్కడ సిద్ధంగానే ఉన్నారు

విరగ కాస్తున్న పంట

కొత్త పండుగను మోసుకొస్తుంది

ఇక గుమ్మాలకు పచ్చటి తోరణాలు కట్టండి మంగళ వాయిద్యాలు మ్రోగించండి ఇప్పుడు చేతిలో పూలు కూడా అగ్నిపూలై ప్రశ్నల్ని గుమ్మరిస్తున్నాయి

కొత్త తరానికి కొత్త రాజకీయాలు ఇక అనివార్యం

తరం ఎప్పుడు ధ్వజమెత్తుతూనే ఉంటుంది తరం మార్పును భళ్ళు న తెరుస్తూనే ఉంటుంది

ఎగిసి పడుతున్న అలల గర్జన వింటున్నారా

జైళ్ళను తోసుకుంటూ

స్వేచ్ఛ గల్లి అంతా పారుతుంది

గుండెల్ని తెరిచి ఆహ్వానిద్దాం

కూలుతున్న బ్రష్టత్వాన్ని తుడిచేసి

మరో ప్రపంచపు వా కి లి ముందు

రంగులు చల్లుకుందాం రండి.

--

ఇవి కూడా చదవండి