నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: మల్లాపూర్ పరిధిలోని ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో, అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు నుంచే స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా మండప ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి మల్లాపూర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్ మాట్లాడుతూ, లంబోదరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ కలసికట్టుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. మండప ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక గీతాలతో మారుమోగుతోంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భరత్, సందీప్, చరణ్, పృథ్వి, నీలేష్, సునీల్, ఆశిష్, అంచల్, వెంకటేష్, లక్కీతో పాటు పలువురు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
మల్లాపూర్ లో వైభవంగా వినాయక చవితి వేడుకలు..
Vinayaka Chavithi celebrations are being held on a grand scale under the auspices of the Ekadanta Vinayaka Association in Mallapur.
ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్): శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (
మిగతా చదవండి →శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం నవరాత్రోత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ట్రైనెట్ న్యూస్): ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థా
మిగతా చదవండి →అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద
మిగతా చదవండి →తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు * సమగ్ర ప్రణాళికతో విమానాశ్రయాల పనులు చేపట్టాలి... * శాఖల మధ్య సమన్వయంతోనే పనులు వేగవంతం * ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:
మిగతా చదవండి →