నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: మల్లాపూర్ పరిధిలోని ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో, అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు నుంచే స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా మండప ప్రాంగణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి మల్లాపూర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్ మాట్లాడుతూ, లంబోదరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరూ కలసికట్టుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. మండప ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక గీతాలతో మారుమోగుతోంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భరత్, సందీప్, చరణ్, పృథ్వి, నీలేష్, సునీల్, ఆశిష్, అంచల్, వెంకటేష్, లక్కీతో పాటు పలువురు సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
మల్లాపూర్ లో వైభవంగా వినాయక చవితి వేడుకలు..
Vinayaka Chavithi celebrations are being held on a grand scale under the auspices of the Ekadanta Vinayaka Association in Mallapur.
ఈ వార్తను షేర్ చేయండి
లింక్లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
కెంట్ యూనివర్సిటీతో ఓయూ విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు..

Osmania University and the University of Kent held a meeting to explore mutual cooperation in academics and research.
మిగతా చదవండి →సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం:

The state government has stepped in to resolve long-pending housing plot issues for Singareni workers, setting up three-member committees headed by district collectors with a 45-day deadline.
మిగతా చదవండి →భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్

Anumula Mandal Arya Vaisya President Pola Saidulu Gupta offered prayers to the clay Ganesha installed in Haliya town.
మిగతా చదవండి →