రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: స్వర మహతి కళా పరిషత్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కళలు, సంస్కృతి పోటీలు 'సృజనోత్సవ్-2026' ముగింపు సభ రవీంద్రభారతిలో
నిర్వహించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీలలో అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అవార్డులను ప్రధానం చేశారు.
అనంతరం కళాకారుల ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.










