ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శనివారం5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:27 pm

శనివారం

5 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:27 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+1.03%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+1.03%
వెండి₹2,18,997/kg+0.80%

తాజా వార్తలు

ఘనంగా కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలు

The 133rd birth anniversary of Hyderabad's first mayor, Korvi Krishnamurthy Mudiraj, was celebrated grandly at Mudiraj Bhavan in New Boiguda, Secunderabad.

nagendra5 September 2026, 9:01 AM0 చూసులుtrinetnews.com
ఘనంగా కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్ 4 :

హైదరాబాద్ నగర తొలి మేయర్, పత్రికా సంపాదకుడు, సంఘ సంస్కర్త కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలు శుక్రవారం సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని ముదిరాజ్ భవన్ ఘనంగా నిర్వహించారు. కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు జి దివాకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఉత్సవాలకు

ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు వి. హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణస్వామి ముదిరాజ్ జీవిత చరిత్ర పుస్తకాలను విడుదల చేశారు. అణగారిన వర్గాల ప్రజల కోసం ఎంతో సేవ చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ ఆదర్శనీయుడని వారన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన ఉమారాణి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ చైర్మన్ అంజమ్మ ను అతిథులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు దినకర్ బాబు, జగన్మోహన్, ముదిరాజ్ మహాసభ నాయకులు కృష్ణమూర్తి, మన్మోహన్, చెన్నయ్య, శారద, సురేందర్ వెంకట్రావు, మంద శ్రీనివాస్, ఆంజనేయులు, నీలం శ్రీనివాస్, ప్రకాష్, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి