చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనలో భాగంగా "స్వర రమణీయం" పేరుతో అమర గాయకుడు తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనా
గానమృతం "కళా బ్రహ్మ శిరోమణి" శ్రీ వంశీ రామరాజు అభినందనలతో త్యాగరాజ గానసభలోని లలిత కళా వేదికలో నిర్వహించారు. నిర్వాహకులు "స్వరరత్న, రాగమాధురి" అన్నమాచార్య ప్రాజెక్టు గాయని రమా ప్రద ఆధ్వర్యంలో ఆలపించిన గాత్ర కచేరి అలరించాయి.








