నల్లగొండ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 1 :
మంగళవారం ఉదయం. 10.00 గంటలకు అమ్మనబోలు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఓటర్ల ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో భాగంగా గ్రామసభ గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ కొంపెల్లి సైదులు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నార్కట్ పల్లి మండలం తహసిల్దార్ గారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ ఐ ఆర్ సర్వేలో నోటీసులు వచ్చిన ఓటర్లకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గారు మరియు వార్డ్ మెంబర్లు గ్రామ కార్యదర్శి బి ఎల్ ఓ ల సూపర్వైజర్ సార్ గ్రామ జి పి ఓ సార్ మరియు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు ఇతర మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ యువకులు మహిళా సంఘాల సభ్యులు నోటీసులు వచ్చిన ఓటర్లు మరియు గ్రామ ప్రజలు మరియు బి ఎల్ ఓ లు మరియు బి ఎల్ ఏ లుపాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.





