ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

బుధవారం19 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:39 pm

బుధవారం

19 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:39 pm

SENSEX76,869-1.55%
NIFTY24,074-1.32%
హైదరాబాద్ 22K₹1,44,411/10g+0.30%
హైదరాబాద్ 24K₹1,57,539/10g+0.30%
వెండి₹2,08,726/kg-3.38%

తాజా వార్తలు

ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు కు గవర్నర్కు ఆహ్వానం.

Telangana Governor Jishnu Dev Varma (Shiv Pratap Shukla) has accepted the invitation to inaugurate the two-day national conclave of the Press Clubs Federation of India in Hyderabad.

nagendra19 August 2026, 2:22 AM0 చూసులుtrinetnews.com
ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు కు గవర్నర్కు ఆహ్వానం.

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ఆగస్టు, 18: హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభిస్తారు.

మంగళవారం నాడు లోక భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల గారిని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ కాంక్లేవ్ ప్రారంభ ఆహ్వాన విందుకు హాజరవుతానని గవర్నర్ తన అంగీకారం తెలిపారు.

జాతీయస్థాయిలో మీడియా పోకడలు ఎదుర్కొంటున్న సవాళ్లు, జర్నలిస్టుల పనితీరుపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సందేశం ఇస్తారు. ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ. రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యులు ఎన్ .శ్రీనివాస్ రెడ్డి తదితరులు గవర్నర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఇదే సందర్భంగా గవర్నర్కు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీని పాలక మండలి అందజేసింది. గవర్నర్కు పూల మొక్కను అందజేసి సత్కరించారు. ఈనెల 21 తేదీన తాజ్ కృష్ణ హోటల్లో జరిగే ఈ సదస్సు ప్రారంభ ఆహ్వాన విందు కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దేశం నలుమూలల నుంచి సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెండు రోజుల సదస్సుకు హాజరవుతారు

ఇవి కూడా చదవండి