Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,169/10g+1.50%
भाषाएँ

Latest News

Governments must focus on BC rights: IAS Narahari

Senior IAS officer and author Parikipandla Narahari urged governments to address OBC rights and aspirations, warning of rising discontent if ignored.

nagendra27 August 2026, 7:45 PM5 व्यूtrinetnews.com
Governments must focus on BC rights: IAS Narahari

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27 :

ఒబిసిల ఆశయాలు, హక్కులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించి, వాటి అమలుకు కృషి చేయాలని సీనియర్ ఐఎఎస్ అధికారి, పుస్తక రచయిత పరికిపండ్ల నరహరి కోరారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన వాటా రావడం లేదని యావత్ భారతదేశంలో ఒబిసిలు చేస్తున్న పోరాటం చిలికిచిలికి గాలివానలా మారకముందే ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని సూచించారు. లేనిపక్షంలో ఉద్యమ స్వరూపం మారే ప్రమాదమున్నదన్నారు. జన అధికార సమితి, బిసి టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశాలి సామాజిక వర్గ సర్పంచుల సన్మాన సభ, సీనియర్ ఐఎఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రచించిన 'ఓబిసిల పోరుబాట -2' పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం రవీంద్రభారతిలో నిర్వహించారు. బిసి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు పుస్తకాన్ని పరిచయం చేయగా, రిటైర్డ్ డిజిపి పూర్ణచందరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ములికుంట్ల సాగర్, మాజీ ఎంఎల్ఎ, కాంగ్రెస్ సీనియర్ నేత ఈరవత్రి అనిల్, చేనేత కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రామన్, బిసి టైమ్స్ అధ్యక్షులు సూర్యారావు, జన అధికార సమితి అధ్యక్షులు చీరాల నారాయణ, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి కీర్తి నాగార్జున, సభ్యులు పరికిపండ్ల సుమంత్ పరికిపండ్ల రామ్ తిట్ల రమేష్ బాబు, మిట్టపల్లి రాజేంద్రకుమార్, జాగిరి శ్రీకాంత్ , గుణ సాగర్ నేత, మూగల మహేష్ పటేల్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం నరహరి మాట్లాడుతూ పద్మశాలీ వర్గం, ప్రత్యేకించి బిసిలు రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ జరుగుతున్న క్రమంలో చట్టసభల్లో బిసిలకు మూడోవంతు రిజర్వేషన్లు ఇవ్వాలని లేదా గతంలో మాదిరిగా ద్విసభ్య సభ్యత్వం అయినా కల్పించాలని ప్రభుత్వాలను కోరాలని సూచించారు. భవిష్యత్తులో మంచి రాజకీయ నేతలుగా ఎదిగి, చట్టసభల్లో వెళ్లాలనే కాంక్షతో పద్మశాలీ సర్పంచ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బిసి సిఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో పోటీతత్వాన్ని తట్టుకొని, గెలిచిన పద్మశాలీ సర్పంచులను సత్కరించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. జన అధికార సమితి అధ్యక్షురాలు చేరాల నారాయణ మాట్లాడుతూ.. ఐఎఎస్ పరికిపండ్ల నరహరి గత పదేళ్లుగా బిసి సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలో సామాజిక చైత్యనానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. మాజీ డిజిపి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. బిసిలకు ప్రత్యేక కుల కోడ్ ఇచ్చేవరకు.. మోదీ ప్రభుత్వం జనగణన ఆపాలని నినాదంతో గ్రామస్థాయి నుంచి పోరాడాలని, ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని సూచించారు. కొండా లక్ష్మణ్ బాపూజీతో పోరాట స్ఫూర్తితో ప్రభుత్వాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

చిరంజీవులు మాట్లాడుతూ.. దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 80 కోట్ల మంది ఒబిసిలు ఉన్నారన్నారు. ఒబిసిల స్థితిగతులు, హక్కులపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఐఎఎస్ పరికిపండ్ల నరహరి 'ఒబిసిల పోరుబాట -2' పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఒబిసి వర్గాల్లో మెదలుతున్న ఆలోచనలు, ఆశయాలపై ఒబిసిల పోరుబాట-2 పుస్తకం రాయడం జరిగిందన్నారు. ఇందులో ఒబిసిలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67శాతానికి పెంచాలని, ఉన్నత విద్యలో, ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వాలని, శాస్త్రీయ పద్ధతిలో ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు వంటి అంశాలను వివరంగా రాసినట్టు చెప్పారు. బిసిలు తమ లక్ష్యాలను సాధించడం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడం, నాయకత్వాన్ని బలోపేతం చేయడం, సంఘటితంగా ముందుకు సాగడం వంటి అంశాలపై పుస్తకాన్ని రచించినట్టు తెలిపారు. మాజీ ఎంఎల్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు కోడ్ ఇచ్చి కులగణన చేసిందన్నారు. దీంతో ఏ వర్గం జనాభా ఉందో స్పష్టంగా తెలిసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకొన్నదన్నారు. కేంద్రప్రభుత్వం కూడా కులగణన చేసి, బిసిలకిచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనంతరం 165 మంది పద్మశాలీ సర్పంచులకు పూలమాలలు, శాలువాతో సన్మానించి, జ్ఞాపిక అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, తెలంగాణ విటల్, తొలి వెలుగు రఘు, బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శి మణికర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →