Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,106/10g+0.02%
भाषाएँ

Latest News

విద్యార్థినీల రక్షణలో ప్రభుత్వాలు విఫలం ఢిల్లీలో కదిలే బస్సులో విద్యార్థినిపై అత్యాచార ఘటన దీనికి నిదర్శనం

SFI national and state leaders criticized central and state governments for failing to ensure the safety of female students, highlighting the recent horrific bus assault case in Delhi.

nagendra11 September 2026, 1:04 AM2 व्यूtrinetnews.com
విద్యార్థినీల రక్షణలో ప్రభుత్వాలు విఫలం ఢిల్లీలో కదిలే బస్సులో విద్యార్థినిపై అత్యాచార ఘటన దీనికి నిదర్శనం

Share this story

Share link keeps your language (?lang=)

జెన్‌-జీ ఉద్యమంలో విద్యార్థినులు, యువత కీలక పాత్ర

మహిళా విద్యకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్ఎఫ్ఐ

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:

విద్యార్థినీలకు రక్షణ కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని వారు అన్నారు.

భువనగిరి వెన్నెల కళాశాలలో ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్లో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ప్రారంభ సూచికగా స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలను ప్రతిబింబించే ఎస్‌ఎఫ్‌ఐ జెండాను రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం.మమత ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.అనురాధ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్లు కృపాజార్జీ, దీపిక, జ్ఞాప్నిక, డి.సుమ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ దేశంలో మహిళలు, విద్యార్థినులపై హింస, వేధింపులు, వివక్ష కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు విద్యా సంస్థల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.జెన్‌-జీ విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థినులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చాటారని ఆమె అన్నారు. తమ విద్యా హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం యువత ముందుకు వస్తున్న తరుణంలో వారి స్వరాన్ని అణిచివేయకుండా ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం–2020 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె విమర్శించారు. విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు నడిపించడం వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగి గర్ల్స్ డ్రాప్‌అవుట్స్ మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.టి.నాగరాజు మాట్లాడుతూ మహిళలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినుల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టళ్లను బలోపేతం చేయాలని, భద్రతా చర్యలు పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.మహిళలను సమాన హక్కులు కలిగిన పౌరులుగా చూడకుండా వివక్షను కొనసాగిస్తూ వారిని ఇంటికే, వంటగదికే పరిమితం చేయాలనే ఆలోచనలను ప్రోత్సహించే శక్తుల పట్ల విద్యార్థి లోకం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళా విద్య, ఉపాధి, స్వేచ్ఛ, సమానత్వం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం.మమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. విద్యార్థినులపై వేధింపులు, భద్రతా సమస్యలు, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజులు, విద్యా సౌకర్యాల కొరత వంటి సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. పూర్వ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ విద్యార్థినులు తమ సమస్యలను వ్యక్తిగత సమస్యలుగా కాకుండా సామాజిక సమస్యలుగా భావించి సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యార్థినుల హక్కుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి దీపిక,సుమ, కృప జార్జ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు, జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఇందు రాణి, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్, పట్టల ఉదయ్ , ధరావత్ జగన్, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు కార్తీక్,ప్రసన్న,నరేందర్, నేహాల్ ,గర్ల్స్ కో-కన్వీనర్లు,, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →