ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,136-1.02%
NIFTY23,172-1.30%
హైదరాబాద్ 22K₹1,43,822/10g-0.94%
హైదరాబాద్ 24K₹1,56,897/10g-0.94%
వెండి₹2,16,956/kg+0.92%

తాజా వార్తలు

యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

Alair MLA and Government Whip Beerla Ailaiah, along with his wife, participated in the auspicious mass Giri Pradakshina at the Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy temple on Swati Nakshatra.

nagendra16 September 2026, 1:57 AM1 చూసులుtrinetnews.com
యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు15(ట్రైనెట్):

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రంగా భావించే స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి బీర్ల అనితతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాదాద్రి కొండ చుట్టూ నిర్వహించిన సామూహిక గిరిప్రదక్షిణలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి క్షేత్రానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.గిరిప్రదక్షిణకు ముందు వైకుంఠ ద్వారం వద్ద ఉన్న పాదాలకు బీర్ల ఐలయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థిస్తూ ఆలయ క్షేత్రం, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానికులు, వేలాది మంది భక్తులతో కలిసి కొండ చుట్టూ సామూహిక గిరిప్రదక్షిణ చేపట్టారు. గిరిప్రదక్షిణలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.గిరిప్రదక్షిణ అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు సతీమణి బీర్ల అనితతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు బీర్ల ఐలయ్య దంపతులకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి