ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:20 pm

ఆదివారం

13 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:20 pm

SENSEX74,782-1.77%
NIFTY23,398-1.60%
హైదరాబాద్ 22K₹1,44,640/10g+0.34%
హైదరాబాద్ 24K₹1,57,789/10g+0.34%
వెండి₹2,16,278/kg-1.67%

తాజా వార్తలు

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి

Telangana State Council of Higher Education Chairman Prof. V. Balakista Reddy stated that the government is working to strengthen the education system during a graduation ceremony in Hyderabad.

nagendra13 September 2026, 2:44 AM0 చూసులుtrinetnews.com
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి   కృషి  తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 12:

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి అన్నారు. అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ వేడుకలు కాచిగూడ మ్యాడమ్ అంజయ్య హాల్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

బాలకిష్ట రెడ్డి పాల్గొని అవంతి గ్రూప్ చైర్మన్, మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అనేక విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని వాటికి అనుగుణంగా విద్యార్థులు రాణించాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్త కోర్సులు

తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచి లాంటిదన్నారు. అవంతి గ్రూప్ చైర్మన్ మాజీ మంత్రి ఎం. శ్రీనివాస రావు మాట్లాడుతూ.. అవంతి గ్రూప్స్ కళాశాల దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు. అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షులు జ్ఞానేశ్వరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం ప్రియాంక, మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎంవి ఎస్ఎస్ నందీష్ అవంతి కళాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్ . వెంకటరమణ, గౌతమ్ మోడీ, చరణ్, డొమినిక్ గాడ్ ఫ్రైడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి