హైదరాబాద్,చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26 : ప్రముఖ గాయకులు కిషోర్ కుమార్ స్మారకార్థం, 'చిత్రపు బ్రదర్స్ కల్చరల్ ఆర్ట్స్ ఫౌండేషన్' సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'గతా రహే హమారా దిల్' (సీజన్-14) పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








