ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శనివారం19 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:15 pm

శనివారం

19 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:15 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,371/10g+1.47%
హైదరాబాద్ 24K₹1,58,586/10g+1.47%
వెండి₹2,22,342/kg+5.15%

తాజా వార్తలు

Ganesh Festival is a Great Celebration Unifying Society: Former Minister Talasani Srinivas Yadav

Former minister and Sanath Nagar MLA Talasani Srinivas Yadav visited various Ganesh pandals in Monda Division and Padmarao Nagar, stating that the festival brings society together.

nagendra19 September 2026, 2:38 AM0 చూసులుtrinetnews.com
Ganesh Festival is a Great Celebration Unifying Society: Former Minister Talasani Srinivas Yadav

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ ,18.

గణేష్ నవరాత్రులు ఒక ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాదని, సమాజాన్ని ఏకం చేసే ఒక గొప్ప వేడుక అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ నవరాత్రులలో భాగంగా ఆయన మోండా డివిజన్, పద్మారావు నగర్ లలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను దర్శించి గణ నాధులకు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు.

మోండా డివిజన్ లో...

మోండా డివిజన్ లోని పలు ప్రాంతాలలో బుధవారం రాత్రి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గణనాధులను దర్శించుకున్నారు. బండి మెట్ లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గందే నాగులు, బండి మెట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాక్ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్, రాజ్ కమల్ ఫ్రెండ్స్ అసోసియేషన్, సెకండ్ బజార్, మారుతి వీధి లలో ప్రతిష్టించిన గణ నాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు గందే నాగులు, కొండాపురం మహేష్ కుమార్ యాదవ్, అమర్, సత్యనారాయణ, శ్రీనాధ్ జయరాజ్, గందే సంతోష్, ఆనంద్ పాటిల్, అబ్బాస్ తదితరులు ఉన్నారు.

పద్మారావు నగర్ ....

మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం రాత్రి పద్మారావు నగర్ లోని పలు బస్తీ లు, కాలనీలో ప్రతిష్టించిన గణపయ్య లను దర్శించుకున్నారు. ముందుగా హమాలీ బస్తీలోని దర్గా వద్ద టీమ్ హిందు సామ్రాట్ ఆధ్వర్యంలో, నెరేటి రవి ఆధ్వర్యంలో ని సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్, శివాజీ అసోసియేషన్, పద్మారావు నగర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్, వాకర్ టౌన్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద, ఈశ్వరమ్మ బస్తీ, బెల్వ డరే గార్డెన్ అపార్ట్మెంట్ లో, సవరాల బస్తీలో ఎల్లేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడిని, బాపూజీ నగర్ లో శ్రీ విష్ణు శివాజీ యూత్ ఆధ్వర్యంలో, ముషీరాబాద్ క్రాస్ రోడ్డులో శక్తి యూత్ అసోసియేషన్, భోలక్ పూర్ లో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్, మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ని మణికంఠ యూత్ అసోసియేషన్, ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్, సెవెన్ హిల్స్ అసోసియేషన్, MIG కాలనీ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, అంబులెన్స్ సురేష్, శ్రీనివాస్, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, కొత్తూరు వెంకట్, లంకరాజు తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి