హైదరాబాద్,నాచారం, సెప్టెంబర్05, ( ట్రైనెట్ న్యూస్)
శక్తి సాయినగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.14 లక్షలు మంజూరు కావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డి సహకారంతో పనులు మంజూరైనట్లు తెలిపారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ కిట్టు ఆధ్వర్యంలో శనివారం డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత పదేళ్లుగా బ్రహ్మపురి కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలను మార్చిలో నిర్వహించిన ప్రజాపాలన–బస్తీబాట కార్యక్రమంలో పరమేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో కాలనీవాసులు కొబ్బరికాయలు కొట్టి, మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారి, నరసింహగౌడ్, రాజిరెడ్డి, బాలరాజు, ఉపేందర్, భాష, సత్యనారాయణగౌడ్, సలీం, మల్లికార్జున్, రామ్‌రెడ్డి, రవికుమార్, సామిగౌడ్, రామ్మూర్తి, తిరుపతి, చంద్రమ్మ, సోయల్, నదీమ్, ఫిరోజ్‌ఖాన్, ధనంజయ, విజయరెడ్డి, కుమారస్వామి, రవీందర్, రాంప్రసాద్, నరేష్‌గౌడ్, రాజుగౌడ్, షేక్‌నూర్, షబ్బీర్, చేతన్, లక్ష్మణ్, లలిత, రజినిరెడ్డి, స్వీటీ, సఖి, బబిత, ప్రమీల, సానియా తదితరులు పాల్గొన్నారు.





