హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 25 :తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ హైదరాబాద్) ఆధ్వర్యంలో "వినో దాల విందు శీర్షికన రవీంద్రభారతిలో నిర్వహించిన కామెడీ షో ఆకట్టుకుంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ హాస్య నటుడు, ఎం.వి సుబ్రహ్మ ణ్యం, కళాకారులు ఎం.వి రమణ, ఎల్ఎస్ఆర్ మూర్తి, కె.కోటేశ్వర రావు, మోహన్ కృష్ణ, శారద, జి. వి.లక్ష్మి, కామెడీ స్కిట్స్ లు చం దా, మతిమరుపు, ఉత్తరం, విడా కులు, పని మనిషి, కొలంబుస్, ఆర్టీసీ బస్సు, డాక్టర్ స్కిట్, ఆధార్ కార్డు తదితర స్కిట్స్ ప్రదర్శించి నవ్వులు పూయించారు. ఈ సంద ర్భంగా ముందుగా ప్రజ్ఞ, శ్రీశారద కూచిపూడి డాన్స్ అకాడమీ చిన్నారులు గానవి, శ్రీవిద్యా, సాంబావి, అబ్బుల్ పభి, ప్రీతీ శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించి అలరించారు. హరి, రాధారాణి పలు గీతాలను మధురంగా గానం చేశారు. అనంతరం జరిగిన సభ కార్యక్ర మానికి భాషా సాంసృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహరెడ్డి, డీడీ యా దగిరి హెచ్ఒడి కె.కామేశ్వరి, ప్రోగ్రాం ఎగ్జి క్యూటివ్ డిడి యాదగిరి చింతా సూర్య నారాయణల చేతుల మీదుగా కళాకారు లకు మెమొంటో, బహుమతులు అంద జేసి, అభినందనలు తెలిపారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్ర ముఖులు, కళా కారులు తదితరులు పాల్గొన్నారు.







