హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 6:
ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి
పాల్పడింది. ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈశ్వర్ సాయి పై ఫిర్యాదు చేసిన మూడు రోజులకే ఆమె ఆత్మహత్యాయత్నం
చేసుకున్న ఘటన ఆలస్యంగా
వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 22వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఈశ్వర్ సాయి ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో నమ్మించి తనను మోసం చేశాడంటూ బాధితురాలు మాధురి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కేసు నమోదైన తర్వాత ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు





