ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ పంట సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. అశోక్ కుమార్ కోరారు. సన్న రకాల వరి సాగు చేసే రైతులు వివరాలు నమోదు చేయిస్తేనే క్వింటాలుకు రూ. 500 బోనస్ వర్తిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ 30, 2026 చివరి తేదీలోపు ప్రతి రైతు తమ పొలాల వివరాలను నమోదు చేయించుకోవాలని, సందేహాల కోసం రైతువేదికను సంప్రదించాలని సూచించారు.





