Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,739/10g-0.27%
भाषाएँ

Latest News

బొప్పాయి సాగుపై అన్నదాత ఆసక్తి

Attracted by government subsidies ranging from 40% to 90%, strong market demand, and short-term yields, farmers across Telangana are increasingly turning towards papaya cultivation.

nagendra20 September 2026, 2:10 AM2 व्यूtrinetnews.com
బొప్పాయి సాగుపై అన్నదాత ఆసక్తి

Share this story

Share link keeps your language (?lang=)

40 నుంచి 90 శాతం వరకు రాయితీలు

ఉద్యాన పంటలకు ప్రభుత్వం సహకారం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19:

రాష్ట్రంలో బొప్పాయి సాగు వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు రైతులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ కాలంలో దిగుబడి రావడం, మార్కెట్లో డిమాండ్ ఉండడం, ఉద్యానశాఖ ద్వారా వివిధ రకాల ప్రోత్సా హకాలు లభిస్తుండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,862 మంది రైతులు 7,609 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే సంగారెడ్డి మొదటి స్థానంలో, రంగారెడ్డి రెండో స్థానంలో ఉన్నాయి.

తక్కువ కాలంలో అధిక దిగుబడి

బొప్పాయి పంటకు మార్కెట్లో ఏడాది పొడవునా డిమాండ్ ఉండడం, తక్కువ వ్యవ ధిలో దిగుబడికి రావడం వంటి కారణాలతో

రైతులు ఈ పంటపై దృష్టి సారిస్తున్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతుల్లోసా గుచేస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉండడంతో సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కొందరు రైతులు బొప్పాయిని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలోని జిల్లాల్లో పండ్లకు భారీ వినియోగ మార్కెట్ ఉండడం కూడా బొప్పాయి సాగుకు కలిసి వస్తున్నది. సం గారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడానికి మార్కెట్ సమీపం, రవాణా సౌకర్యాలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

రాయితీలతో ప్రోత్సాహం

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందు కు ప్రభుత్వం వివిధ పథకాల కింద రైతులకు రాయితీలు అందిస్తున్నది. 40శాతం నుంచి గరిష్టంగా 90 శాతం వరకు రాయితీలు అం దుబాటులో ఉండడంతో రైతులపై ప్రారంభ పెట్టుబడి భారం కొంత తగ్గే అవకాశం ఉన్నది. పంట సాగుకు అవసరమైన అంశాల్లో పథకాల నిబంధనలకు అనుగు ణంగా రైతులకు సహాయం అందుతున్నది. రాయితీలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు నాణ్యమైన మొక్కలు, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని అధికారులు సూ చిస్తున్నారు. బొప్పాయి సాగులో నీటి యా జమాన్యం, ఎరువుల వినియోగం, తెగుళ్ల నియంత్రణ కీలకంగా ఉంటాయని చెబు తున్నారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే బొప్పాయిలో తక్కువ వ్యవధిలో దిగుబడులు పొందే అవకాశం ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే నేల స్వభావం, నీటి లభ్యత, నాణ్యమైన నాట్ల సామగ్రి, తెగుళ్ల నియంత్రణ, మార్కెట్ ధరలు వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో సాగు చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు బొప్పాయి మొక్కలు, ఎరువులు, మల్చింగ్, వ్యవసాయ బావులు, కుంటలు, బిందు సేద్యం, తుంపర సేద్యం మొదలైన వివిధ రకాల వనరులను అందజేస్తున్నారు. బ్యాంకులు నిర్ణీత యూనిట్ ధర ప్రకారం బొప్పాయి రైతులకు అందజేస్తున్నాయి.

మార్కెట్ సదుపాయాలు

బొప్పాయి, ఇతర పండ్లు, కూరగాయల మా ర్కెటింగ్కు వరంగల్, ఖమ్మం, గడ్డిఅన్నా రం ప్రాంతాల్లో మార్కెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పంటను కోత అనంతరం సమీప మార్కెట్లకు తరలించేం దుకు రవాణా, నిల్వ, విక్రయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మార్కెట్ సదుపాయాలు అందుబా టులో ఉండటం వల్ల రైతులు పంటను విక్రయించేందుకు ప్రత్యామ్నాయ కేంద్రాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ మార్కెటింగ్ వ్యవస్థ కూడా సమర్థంగా పనిచేసేలా చర్యలు తీ సుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే బొప్పాయి దిగుబడి 202526లో 1,68,570 మెట్రిక్ టన్నులలో వస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 32 జి ల్లాల్లోని 3,862 మంది రైతులు 7,609 ఎక రాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 870 మంది రైతులు 1,658 ఎకరాలు, రంగారెడ్డిలో 696 మంది

రైతులు 1,180 ఎకరాలు, ఖమ్మంలో 500 మంది రైతులు 1,124 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 166 మంది రైతులు 387 ఎక రాల్లో సాగు చేస్తున్నారు.." అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్ ఎక్స్పో ర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ రాష్ట్రంలో తాజా పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహిం చేందుకు ఆర్థిక సహాయ (ఎఫ్ఎస్) పథకం అమలు చేస్తున్నది. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచడం, రైతులను అధిక విలువ కలిగిన పంటల వైపు ప్రోత్సహించడం ఈ కార్యక్ర మం లక్ష్యంగా ఉన్నది. బొప్పాయి వంటి పంటలకు అందుతున్న ప్రోత్సాహకాలతో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశము న్నది. పంటల ఎంపిక నుంచి సాగు, కోత, మార్కెటింగ్ వరకు రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తే బొప్పాయి సాగు మరింత విస్తరించే అవకాశం ఉన్నద ని ఉద్యాన రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల ను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుగానే విక్రయ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. బొప్పాయి సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ, రైతులకు స్థిరమైన ఆదాయం లభించాలంటే నాణ్యమైన మొక్కల సరఫరా, తెగుళ్ల నియంత్రణ, శా స్త్రీయ సాగు పద్ధతులు, పంట అనంతర నిర్వ హణ, మార్కెటింగ్ సదుపాయాలు కీలకంగా మారనున్నాయి.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →