Monday9 November 2026Hyderabad

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
Languages

Latest News

End ముగిసిన భారత్–అమెరికా ‘టైగర్ ట్రయంఫ్–2026’ విపత్తు సహాయక చర్యల్లో సమన్వయం పెంపునకు త్రివిధ దళాల కసరత్తు

nagendra7 November 2026, 4:42 AM0 viewstrinetnews.com
End ముగిసిన భారత్–అమెరికా ‘టైగర్ ట్రయంఫ్–2026’ విపత్తు సహాయక చర్యల్లో సమన్వయం పెంపునకు త్రివిధ దళాల కసరత్తు

Share this story

Share link keeps your language (?lang=)

విశాఖపట్నం, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

భారత్–అమెరికా త్రివిధ దళాల సంయుక్త మానవతా సహాయం, విపత్తు సహాయక విన్యాసాలు ‘టైగర్ ట్రయంఫ్–2026’ ముగిశాయి. ఐదో విడతగా నిర్వహించిన ఈ విన్యాసాల ముగింపు వేడుక నవంబర్ 5న విశాఖపట్నంలో జరిగింది.

అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు జరిగిన విన్యాసాల్లో ఇరు దేశాల సాయుధ దళాల సిబ్బంది పాల్గొన్నారు. విపత్తుల సమయంలో సంయుక్త సహాయక చర్యల ప్రణాళిక, నిర్వహణలో సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టిసారించారు. సముద్రం నుంచి తీరప్రాంతాలకు చేరుకుని చేపట్టే సంయుక్త కార్యకలాపాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.

స్టాఫ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా కార్యాచరణ ప్రణాళికలు, నిపుణుల ఉపన్యాసాలు, అనుభవాల మార్పిడి కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ రంగం, వైద్య సేవలు తదితర అంశాల్లో ఉత్తమ విధానాలను పంచుకున్నారు. అనంతరం టేబుల్‌టాప్ ఎక్సర్‌సైజ్‌లో ఊహాత్మక విపత్తు పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందించిన ప్రణాళికలను అన్వయించారు. సహాయక చర్యల్లో ఎదురయ్యే సవాళ్లు, సమన్వయ వ్యవస్థలపై అవగాహన పెంపొందించుకున్నారు.

ముగింపు కార్యక్రమానికి తూర్పు నౌకాదళ సమూహాధిపతి రియర్ అడ్మిరల్ విశాల్ బిష్ణోయ్, అమెరికా పసిఫిక్ ఫ్లీట్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె. మార్టినెజ్ డి పినిల్లోస్‌తో పాటు ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

2019లో ప్రారంభమైన టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు భారత్–అమెరికా రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతకు తోడ్పడుతూ సంయుక్త విపత్తు సహాయక సామర్థ్యాలను మెరుగుపరచాలన్న ఇరు దేశాల నిబద్ధతను తాజా విన్యాసాలు చాటాయి.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య