హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో "స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం" చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు
బెరి రామచంద్ర యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సాంప్రదాయ సంగీత, నృత్య కళలను ప్రోత్సహించి కళాకారులలో నూతన ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు . కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాతీయ యాదవ హక్కుల పోట సమితి కార్యదర్శి
వంటల జంగయ్య యాదవ్,
పోచబోయిన సురేష్ యాదవ్,
ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ వీర భోగ వసంత రాయలు,
మారమోని శ్రీశైలం యాదవ్
అభిరామ్ , సంస్థ అధ్యక్షుడు బి. నాగేంద్ర యాదవ్, ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్: బి. దివ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.








