హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
"శ్రవణ రాగ సుధ శ్రవణానందం" ఆధ్వర్యంలో 21వ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని గుండవరపు హనుమంత్ రావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహితీ వేదిక ఉమెన్స్ చైర్ పర్సన్ అంజని కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కార్యనిర్వాహకులు కె. నాగ శిరీష నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






