చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 : సుమతీ మెమోరియల్ ట్రస్ట్, కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ విద్యా సాగర్ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా "అహాహా.. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు...." పేరుతో ప్రత్యేక సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా మారుతి కళా వేదికలో నిర్వహించారు. గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






