ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,673/10g+3.87%
హైదరాబాద్ 24K₹1,67,643/10g+3.87%
వెండి₹2,25,095/kg-0.12%

తాజా వార్తలు

Embrace the Impossible: An Inspiring Philosophical Reflection

The universe never alters its laws for anyone; what seems impossible is just your fear, and your effort proves it otherwise.

nagendra25 August 2026, 4:47 AM1 చూసులుtrinetnews.com
Embrace the Impossible: An Inspiring Philosophical Reflection

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అసాధ్యం

విశ్వం తన నియమాన్ని ఎప్పుడూ మార్చుకోదు,

నీ ఆక్రందనల కోసం తన గమనాన్ని ఆపదు,

నీ కన్నీళ్లను చూసి కాలం వెనక్కి తిరగదు,

నీ కోరికల కోసం విధి తన రాతను చెరపదు,

అందుకే అసాధ్యం అనిపించేది నీ భయమే,

అసాధ్యం కాదని నిరూపించేది నీ ప్రయత్నమే.

నిన్ను నువ్వు చిన్నచూపు చూసిన క్షణమే ఓటమి,

నీపై నమ్మకం ఉంచిన క్షణమే విజయానికి తొలి అడుగు,

పడిపోయిన ప్రతిసారీ నేల నిన్ను ఆపదు,

లేచి నిలబడటానికి ఒక అవకాశం మాత్రమే ఇస్తుంది,

కన్నీటి ప్రతి బొట్టు ఒక కథను చెబుతుంది,

కష్టాల ప్రతి గాయం ఒక పాఠాన్ని నేర్పుతుంది.

నువ్వు గొప్పవాడినని గర్వపడకు,

నువ్వు ఓడిపోయావని కుంగిపోకు,

ఈ కాలచక్రంలో ఏదీ శాశ్వతం కాదు,

ఈ ప్రపంచంలో ఎవరి స్థానం శాశ్వతం కాదు,

నేడు శిఖరంపై ఉన్నవాడు రేపు నేలపై ఉండవచ్చు,

నేడు నేలపై ఉన్నవాడు రేపు శిఖరాన్ని చేరవచ్చు.

నీ అసంతృప్తి కూడా ఒకరోజు జ్ఞాపకమే,

నీ అహంకారం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది,

నీ పేరు కూడా కాలం పుటల్లో మసకబారుతుంది,

కానీ నీ మంచితనం మాత్రం ఎవరో ఒకరి గుండెలో మిగులుతుంది,

అందుకే జీవితాన్ని గెలవాలని కాదు,

జీవితానికి ఒక అర్థం ఇవ్వాలని ప్రయత్నించు.

విశ్వం తన గమనంలో సాగుతూనే ఉంటుంది,

కాలం తన చక్రాన్ని తిప్పుతూనే ఉంటుంది,

మనిషి మాత్రం తన అడుగులను మార్చుకోవాలి,

అసాధ్యం అనుకున్న దారిలోనే ధైర్యంగా నడవాలి,

ఎందుకంటే నీ పరిమితులను నిర్ణయించేది ప్రపంచం కాదు,

నీ ప్రయత్నానికి నువ్వే వేసుకున్న హద్దులు మాత్రమే!

రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.

చరవాణి : 9866179385

ఇవి కూడా చదవండి