ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,764-2.29%
NIFTY23,459-1.84%
హైదరాబాద్ 22K₹1,45,621/10g-0.91%
హైదరాబాద్ 24K₹1,58,859/10g-0.91%
వెండి₹2,24,978/kg+1.53%

తాజా వార్తలు

కాళోజి ఆలోచన ధోరణిని ఉనికిపుచ్చుకోవాలి పురస్కారం అందజేస్తున్న మంత్రి జూపల్లి

Minister Jupalli Krishnarao stated that Padma Vibhushan Kaloji Narayana Rao was the voice of the people and a symbol of social awakening.

nagendra10 September 2026, 2:02 AM1 చూసులుtrinetnews.com
కాళోజి ఆలోచన ధోరణిని ఉనికిపుచ్చుకోవాలి   పురస్కారం అందజేస్తున్న మంత్రి జూపల్లి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 9 :

పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుక, సామాజిక చైతన్యానికి చిరునామా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు 112 వ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... నేటితరం కవులు కాళోజి ఆలోచన ధోరణి ఉనికిపుచ్చుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక పరివర్తన కవులు కళాకారులతోనే సాధ్యమవుతుందని ఆ దిశగా వారు పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం కాళోజీ సాహిత్య ప్రక్రియలు ఒక భాగమని కొనియాడారు. ఎవరి వాడుక భాష వారు రాయాలని, బానిస భావన పోవాలనే కాళోజి మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం ప్రముఖ కవి వి ఆర్ విద్యార్థికి కాళోజి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు వెన్నెల గద్దర్, సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు దినకరన్, పల్లె నరసింహ, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస రావు, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →