నాంపల్లి , ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : 2023లో రెగ్యులరైజ్ అధ్యాపకుల ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు, సర్వీస్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పార్లమెంట్ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి ని తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పోర్ట్స్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 2023లో రెగ్యులరైజ్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు సర్వీస్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వేమ్ నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. 2023 రెగ్యులరైజ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరించిన మంత్రి శ్రీ వాకాటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ , కోశాధికారి ఉపేందర్ , హైదరాబాద్ జిల్లా నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి భాను రవి పాల్గొన్నారు.
తాజా వార్తలు
రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
Telangana Government Lecturers Association representatives met MP Vem Narender Reddy to submit a memorandum seeking the resolution of service issues.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
బాపూ ఘాట్‌లో జాతిపితకు ఘన నివాళి.. డిజిటల్ మ్యూజియం ప్రారంభం

జాతిపితకు ఘననివాళి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 02 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ బాపూ ఘాట్ లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు నివాళులు అర్పించారు. ఈ సంద
మిగతా చదవండి →మహాత్మా గాంధీ ఆశయాలను పాటించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్, అక్టోబర్,2.జాతిపిత మహాత్మాగాంధీ హింసకు పాల్పడకుండా, శాంతి మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
మిగతా చదవండి →'తత్వం' క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ

'తత్వం'లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో
మిగతా చదవండి →బీజేపీ నల్లగొండ జిల్లా దివ్యాంగుల విభాగం కో కన్వీనర్‌గా ముంత మల్లేష్ యాదవ్ నియామకం

నల్లగొండ , ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 1 : బీజేపీ నల్గొండ దివ్యాoగుల విభాగం జిల్లా కో కన్వీనర్ గా డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన ముంత మల్లేష్ యాదవ్ ను నియమిస్తూ ఉత్తరువు కాఫీ ని బీజేపీ దివ్యాoగుల జిల్లా కన్
మిగతా చదవండి →