నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : వినాయక చవితి సందర్భంగా నాచారం పరిధిలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబానగర్‌లోని సూర్య శుభకర విజ్ఞ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. సుమారు వెయ్యి ఇస్తారాకు కప్పులతో రూపొందించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కళాకారుడు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తామే స్వయంగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేపర్ స్ట్రాలు, రూబిక్స్ క్యూబ్స్, చెక్క స్టిక్స్, మట్టి ప్రమిదలు, పేపర్ టీ కప్పులు, బిస్కెట్ కోన్స్, దారం, న్యూస్ పేపర్లతో వినూత్న విగ్రహాలను రూపొందించినట్లు చెప్పారు. చంద్రయాన్ స్ఫూర్తితోనూ ప్రత్యేక థీమ్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం పర్యావరణహిత పద్ధతిలో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు.. ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..
An eco-friendly 15-foot Ganesha idol made from about 1,000 leaf plates is captivating devotees in Nacharam for Vinayaka Chavithi.
nagendra20 September 2026, 2:19 AM4 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
కాచం సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత కాచం బిక్షమయ్యకు నివాళి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా హైదరాబాద్

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

