నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : వినాయక చవితి సందర్భంగా నాచారం పరిధిలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబానగర్‌లోని సూర్య శుభకర విజ్ఞ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. సుమారు వెయ్యి ఇస్తారాకు కప్పులతో రూపొందించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కళాకారుడు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తామే స్వయంగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేపర్ స్ట్రాలు, రూబిక్స్ క్యూబ్స్, చెక్క స్టిక్స్, మట్టి ప్రమిదలు, పేపర్ టీ కప్పులు, బిస్కెట్ కోన్స్, దారం, న్యూస్ పేపర్లతో వినూత్న విగ్రహాలను రూపొందించినట్లు చెప్పారు. చంద్రయాన్ స్ఫూర్తితోనూ ప్రత్యేక థీమ్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం పర్యావరణహిత పద్ధతిలో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Latest News
నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు.. ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..
An eco-friendly 15-foot Ganesha idol made from about 1,000 leaf plates is captivating devotees in Nacharam for Vinayaka Chavithi.
nagendra20 September 2026, 2:19 AM2 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
సుపరిపాలనకు పారదర్శకత, జవాబుదారీతనం కీలకం అంతర్ పార్లమెంటరీ యూనియన్ సభలో హరివంశ్ పిలుపు

గణాంక పరిశోధన, సమాచార విశ్లేషణలో సహకారానికి ఒప్పందం పహ్లే ఇండియా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాతీయ గణాంక కార్యాలయం

గణాంక పరిశోధనకు సహకారంపహ్లే ఇండియా ఫౌండేషన్‌తో కేంద్ర గణాంక శాఖ అవగాహన ఒప్పందం

జాతీయ చలనచిత్ర భాండాగారానికి శివాజీ గణేశన్ మూడు చిత్రాల ప్రతులు తొలిసారిగా సేకరణలోకి ‘తిరువరుట్చెల్వర్’

