ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:14 pm

ఆదివారం

20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:14 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,667/10g+2.13%
హైదరాబాద్ 24K₹1,58,909/10g+2.13%
వెండి₹2,23,554/kg+6.19%

తాజా వార్తలు

నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు.. ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..

An eco-friendly 15-foot Ganesha idol made from about 1,000 leaf plates is captivating devotees in Nacharam for Vinayaka Chavithi.

nagendra20 September 2026, 2:19 AM0 చూసులుtrinetnews.com
నాచారంలో ఆకట్టుకుంటున్న పర్యావరణహిత గణనాథుడు..  ఇస్తారాకు కప్పులతో 15 అడుగుల వినాయకుడు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19 : వినాయక చవితి సందర్భంగా నాచారం పరిధిలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాబానగర్‌లోని సూర్య శుభకర విజ్ఞ వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 అడుగుల ఎత్తైన పర్యావరణహిత వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్ఠించారు. సుమారు వెయ్యి ఇస్తారాకు కప్పులతో రూపొందించిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కళాకారుడు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తామే స్వయంగా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో పేపర్‌ స్ట్రాలు, రూబిక్స్‌ క్యూబ్స్, చెక్క స్టిక్స్, మట్టి ప్రమిదలు, పేపర్‌ టీ కప్పులు, బిస్కెట్‌ కోన్స్‌, దారం, న్యూస్‌ పేపర్లతో వినూత్న విగ్రహాలను రూపొందించినట్లు చెప్పారు. చంద్రయాన్‌ స్ఫూర్తితోనూ ప్రత్యేక థీమ్‌తో విగ్రహాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల అనంతరం పర్యావరణహిత పద్ధతిలో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి