E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

శుక్రవారం

25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX73,712-1.53%
NIFTY23,074-1.45%
హైదరాబాద్ 22K₹1,41,989/10g-1.63%
హైదరాబాద్ 24K₹1,54,897/10g-1.63%
వెండి₹2,13,908/kg-2.41%

తాజా వార్తలు

జిల్లా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డాక్టర్ కుక్కడాల ఆంజనేయులు

Dr. Kukkadala Anjaneyulu visited the Nalgonda district girls' kabaddi training camp on Wednesday and wished the players success in the upcoming state-level tournament.

nagendra24 September 2026, 3:48 AM1 చూసులుtrinetnews.com
జిల్లా కబడ్డీ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డాక్టర్ కుక్కడాల ఆంజనేయులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న సబ్ జూనియర్ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు హాజరుకానున్న నల్లగొండ జిల్లా బాలికల జట్టు శిక్షణ శిబిరాన్ని శ్రీ శ్లోకా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ కుక్కడాల ఆంజనేయులు బుధవారం ఉదయం సందర్శించారు.

ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో ఉన్న క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తమ క్రీడా నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు.

క్రీడాకారులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్ కుక్కడాల ఆంజనేయులు ఆకాంక్షించారు.

నల్లగొండ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని శ్రీ శ్లోకా పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు సంఘం అధ్యక్ష, కార్యదర్శులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పేద క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ కుక్కడాల ఆంజనేయులు తెలిపారు. అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారులకు తమ విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించేలా భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్లోకా పాఠశాల ప్రిన్సిపాల్ సాదియా, కబడ్డీ కోచ్ ఎం.డి. అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

గణనాథుని సేవలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

గణనాథుని సేవలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

గణనాథుని సేవలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్... *ట్రైనెట్ న్యూస్, అంబర్ పేట :* బాగ్ అంబర్‌పేట డివిజన్ మల్లికార్జున్ నగర్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని పూజ కార్యక్రమంలో అంబర్ పేట ఎమ్మెల్యే కా

మిగతా చదవండి →

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి  ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

Deputy CM Bhatti Vikramarka and Minister Jupally Krishna Rao directed officials to develop a comprehensive action plan to position Telangana as a prominent national and international tourism destination.

మిగతా చదవండి →

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దసరాలోపు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో బొగ్గు లభ్యత, అదనపు భారం తదితర అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను ప్రశ్నించారు.

మిగతా చదవండి →