ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఆత్మకూరు(ఎం)మండలం ఖప్రాయిపల్లి గ్రామానికి చెందిన బుంగా దశమ్మ పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ తదితరుల చేతుల మీదుగా ఆమె ఈపట్టాను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దశమ్మ మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం నుండి ప్రొఫెసర్ బి. లావణ్య పర్యవేక్షణలో పీహెచ్‌డీ పట్టా పొందడం తనకు అత్యంత సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. తన ఈ సాధనలో ఎంతో సహకరించిన తల్లిదండ్రులు కీర్తిశేషులు బుంగా వెంకయ్య మరియు మణెమ్మలకు, తన భర్త ఆకుల శ్యాంసుందర్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు, అలాగే తోడ్పాటునందించిన అధ్యాపకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






