హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :
అభ్యుదయ కవి, పరిశోధకుడు, సమగ్రంధ్ర సాహిత్య చరిత్ర రచయిత డా. ఆరుద్ర 101వ జయంతిని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో 'కొండగాలి తిరిగింది' పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి
త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త డా. వోలేಟಿ పార్వతీశం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సాహిత్య చరిత్రకారుడిగా తెలుగు జాతి గర్వించదగ్గ మహా రచయిత అని కొనియాడారు. కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద ఎస్.వి.రామారావు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి: మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు
ప్రముఖ గాయనీ, గాయకులు టీ.బాలకామేశ్వరరావు, ఎన్.అఖిల ఆలోచించిన సినీ గీతాలు అలరించాయి.
వ్యాఖ్యాతగా ఎమ్.మనోహర్ వ్యవహరించారు.







