Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,003/10g+1.38%
भाषाएँ

Latest News

Double Bedroom Houses Will Be Allotted Only to Eligible Locals: Talasani Srinivas Yadav

Former Minister and Sanathnagar MLA Talasani Srinivas Yadav assured locals that double-bedroom houses will be allocated strictly to deserving residents.

nagendra6 September 2026, 6:31 AM3 व्यूtrinetnews.com
Double Bedroom Houses Will Be Allotted Only to Eligible Locals: Talasani Srinivas Yadav

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,5. అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేలా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన బన్సీలాల్ పేట లోని బండ మైసమ్మ నగర్ లో ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. తమకు విద్యుత్ మీటర్లు లేవని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది తమకు ఇండ్లు రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గా కేసీఆర్ అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంకా కొన్ని ఇండ్లు కేటాయించాల్సినవి ఉన్నాయని, వాటిని అర్హులకు ఇవ్వాలని కలెక్టర్ కు లేఖ కూడా వ్రాశామని అన్నారు. అర్హులైన వారికి త్వరగా ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు తెలియకుండానే షాపులను వేలం వేశారని, కాలనీ వాసులు చెప్పగా, షాపుల ద్వారా వచ్చే అద్దెను కాలనీ నిర్వహణకు ఖర్చు చేయాలనే ఆలోచనతోనే షాపులను నిర్మించినట్లు వివరించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కవాడిగూడా DC పుష్పాలత, ఎలెక్ట్రికల్ ADE దుర్గ ప్రసాద్, హార్టికల్చర్ అధికారి సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, కుమార్ యాదవ్, ఫహీం, రంజిత్, అబ్బాస్, వినయ్, సాయి తదితరులు ఉన్నారు.

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం

ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ మోసాలపై శనివారం బన్సీలాల్ పేట లోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →