ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం27 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

గురువారం

27 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX77,187-0.46%
NIFTY24,159-0.39%
హైదరాబాద్ 22K₹1,52,834/10g+0.42%
హైదరాబాద్ 24K₹1,66,728/10g+0.42%
వెండి₹2,27,625/kg+0.14%

తాజా వార్తలు

Do Not Wish Evil Upon Others: An Inspiring Philosophical Reflection

A thoughtful reflection on patience, maintaining inner peace, and letting karma handle wrongdoing without losing one's goodness, written by K. Muralimohan Raju.

nagendra27 August 2026, 3:42 AM0 చూసులుtrinetnews.com
Do Not Wish Evil Upon Others: An Inspiring Philosophical Reflection

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చెడపకురా! చెడేవు

రాయి వేసినంత మాత్రాన కొలను ఎప్పటికీ కలుషితం కాదు

అలజడి కొంతసేపే ఉంటుంది

తర్వాత నీరు తేరుకుంటుంది

తన నిర్మలత్వాన్ని తిరిగి పొందుతుంది

అలాగే ఎవరో చెడు చేశారని

మనసులో చెడును పెంచుకోకు

వాళ్లు వేసిన రాయికి

నీ మనశ్శాంతిని బలిచేయకు

నిన్ను బాధించిన వారి కోసం

నీ మంచితనాన్ని మార్చుకోకు

వాళ్ల తప్పులకు ప్రతీకారం

నీ జీవితానికి మార్గం కాకూడదు

కాలమే ప్రతి ఒక్కరికీ

వాళ్ల కర్మకు తగిన ఫలితాన్ని ఇస్తుంది

నువ్వు మాత్రం నిశ్శబ్దంగా

నీ దారిలో ముందుకు సాగు

రాయి కొలనులో పడుతుంది

అలలు కొంతసేపు ఎగసిపడతాయి

కానీ చివరికి నీరు ప్రశాంతమవుతుంది

రాయి మాత్రం అడుగునే మిగులుతుంది

అలాగే చెడు చేసిన మనిషి

తన చెడు ఫలితాన్నే అనుభవిస్తాడు

నువ్వు మాత్రం మంచితనంతో నిలబడితే

నీ మనసే నీకు అద్దమవుతుంది

ప్రతీకారం తీర్చుకోవడం గొప్పతనం కాదు

క్షమించి పక్కకు తప్పుకోవడమే గొప్పతనం

నీ ప్రశాంతతను కాపాడుకో

నీ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకు.

రచన : కె.మురళీమోహన్ రాజు, నెల్లూరు.

చరవాణి : 9866179385

ఇవి కూడా చదవండి