నల్గొండ జిల్లా ఇంచార్జ్ (విశ్వనాధ్) హాలియా: శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ స్వయం భూ భక్తాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 23, 2026 (ఆదివారం) నాడు హాలియాలో అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ వారిచే విశేష 'దివ్య ప్రవచనం' ఏర్పాటు చేయబడింది.
ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీ శ్రీ డాక్టర్ రామ లక్ష్మణ దాస్ ప్రభుజీ వారు విచ్చేస్తున్నారు.
అలాగే, ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఈ క్రింది ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు:
శ్రీ కుందూరు జానారెడ్డి గారు (మాజీ CLP నేత)
శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు (పార్లమెంటు సభ్యులు, నల్లగొండ)
శ్రీ కుందూరు జయ వీర్ రెడ్డి గారు (శాసన సభ్యులు, నాగార్జునసాగర్)
శ్రీ M.C. కోటి రెడ్డి గారు (శాసనమండలి సభ్యులు, నల్లగొండ)
శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు (శాసనమండలి సభ్యులు)
శ్రీ చింతల చంద్రారెడ్డి గారు (మున్సిపల్ చైర్మన్, హాలియా)
శ్రీ గోని రాజా రమేష్ యాదవ్ గారు (మున్సిపల్ వైస్ చైర్మన్, హాలియా)
శ్రీ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు (మార్కెట్ కమిటీ చైర్మన్, హాలియా)
శ్రీ చిట్టిప్రోలు యాదగిరి గారు
కార్యక్రమ సమయ పట్టిక:
సాయంత్రం 5:11 ని.లకు: కోలాటాలు, చెక్కభజనలతో ప్రభుజీ గారికి ఘన స్వాగతం.
సాయంత్రం 6:05 ని.లకు: వివిధ పాఠశాలల విద్యార్థులచే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు.
సాయంత్రం 7:05 ని.లకు: శ్రీశ్రీశ్రీ శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ వారి దివ్య ప్రవచనం.
వేదిక: శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ స్వయం భూ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, హాలియా.
భక్తులందరూ విశేష సంఖ్యలో విచ్చేసి, స్వామివారి కృపకు, తీర్థప్రసాదాలకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ కోరుతోంది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ వార్తను ప్రచురించి/ప్రసారం చేసి భక్తులకు చేరవేయగలరని మనవి.
ఇట్లు,
ఆహ్వానించువారు:
శ్రీ సీతారామచంద్ర స్వామి సహిత శ్రీ స్వయం భూ భక్తాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9948641227, 9989133494, 9912271167





