హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 19 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ‘C’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ధృవ్ XI C.C. జట్టు యూత్ C.C.పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
యూత్ C.C. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ధృవ్ XI C.C. 45.1 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఎం. వంశీ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్‌తో 80 బంతుల్లో 107 పరుగులు సాధించారు. ఆయన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన యూత్ C.C. 140 పరుగులకే ఆలౌట్ అయింది. ధృవ్ XI C.C. బౌలర్లు వడ్త్యావత్ గణేష్ మరియు ముదావత్ పవన్ అద్భుతంగా రాణించి చెరో 4 వికెట్లు పడగొట్టారు.
వంశీ రెడ్డి, గణేష్, పవన్ సమిష్టి ప్రదర్శనతో ధృవ్ XI C.C. 72 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసింది.





