హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో ధ్రువ్ XI సి.సి. జట్టు అద్నాన్ సి.సి.తో తలపడింది.
వియాన్ అగర్వాల్ బ్యాటింగ్.. దీపక్ కుమార్ స్పిన్‌తో ధ్రువ్ XI సి.సి.కు ఉత్కంఠ విజయం
మొదట బ్యాటింగ్ చేసిన ధ్రువ్ XI సి.సి. జట్టు 47 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. వియాన్ అగర్వాల్ 87 బంతుల్లో 7 ఫోర్లతో 76 పరుగులు చేయగా, సిద్ధార్థ నాగుల 46 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు.
225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అద్నాన్ సి.సి. జట్టు 49 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో ధ్రువ్ XI సి.సి. 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
ధ్రువ్ XI బౌలర్లలో దీపక్ కుమార్ 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, బి. నిద్విత్ క్రిష్ 9 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు.
జట్టు సమష్టి స్ఫూర్తితో అద్భుత విజయాన్ని సాధించిన ఆటగాళ్లను ధ్రువ్ XI సి.సి. అధ్యక్షుడు ఎల్. మహేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు ఎల్. శివరామ్ ప్రసాద్, కార్యదర్శి ఎల్. గంగాధర్ తిలక్ అభినందించారు.






