Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,816/10g-0.22%
भाषाएँ

Latest News

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంసీఎం రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy stated that his government is dedicated to the progress of Dalits, Adivasis, and tribal communities through targeted welfare initiatives.

nagendra22 September 2026, 11:31 AM2 व्यूtrinetnews.com
దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంసీఎం రేవంత్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంసీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదని గుర్తు చేశారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీది అన్నారు.

మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్​ నిరోధక చట్టం అమలుపై ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే అని తెలిపారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం అని సీఎం వివరించారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం అన్నారు.

రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని చెప్పారు. దళితులు, గిరిజనులు,ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని, బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. చదువొక్కటే జీవితాలను మారుస్తుందని, అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదు. పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించండి సీఎం సూచించారు. ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పనిచేస్తుందని , రాజకీయలకు అతీతంగా అందరూ అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ చైర్మన్లు, సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति

भाजपा राज्य महिला मोर्चा कार्यसमिति सदस्य के रूप में भाग्यलक्ष्मी की नियुक्ति... ट्राइनेट न्यूज़, हैदराबाद, 08 अक्टूबर: भारतीय जनता पार्टी तेलंगाना राज्य महिला मोर्चा की कार्यसमिति सदस्य के रूप में हैदराबाद सेंट्रल...

और पढ़ें →

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →