ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం గురువారం రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో రజక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగడి ప్రదేశంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సహకార సంఘం అధ్యక్ష, కార్యదర్శి పైళ్ళ ప్రశాంత్, ఎలిమినేటి నరేష్, రజక సంఘం రాష్ట్ర నాయకులు ఎలిమినేటి బుచ్చయ్య, మాజీ అధ్యక్షులు వెలిమేకన్నె సత్యనారాయణ, ఐలమ్మ విగ్రహ నిర్వహణ కమిటీ చైర్మన్ ఎలిమినేటి నగేష్, సీనియర్ జర్నలిస్ట్ ఎలిమినేటి జహంగీర్,రజక సంఘం సభ్యులు యాదయ్య, కరకయ్య,మల్లయ్య,రాములు, శంకరయ్య, స్వామి,సత్తయ్య, ఉప్పలయ్య, పుల్లయ్య,శ్రీను, కిష్టయ్య,శాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు





