ఈ సదర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించినఆర్ ఐ ఓ శారద
(బై రాజా పెంట పాటీ బ్యూరో చీఫ్ ఏపీ)
అమరావతి సెప్టెంబర్ 5 ట్రై నెట్ (ఏపీ)
మహిళలకు ప్రత్యేకంగా సాంస్కృతి కోత్సవాలు నిర్వహించడం మంచి నిర్ణయం అని ఆమె అన్నారు. అమ్మాయిలు మహిళలలో అనేక రకాల ప్రతిభా పాటవాలు ఉన్నాయని, వాటిని ప్రదర్శించడానికి తరుణీ తరంగిణి లాంటి వేదికలు ఉపయోగపడతాయని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో కాలేజీ విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం నిర్వాహకులు పి తులసి మాట్లాడుతూ ఈ మహిళా ఉత్సవాలకు తరుణీ తరంగిణీ సెలబ్రేటింగ్ హెర్ పవర్ గ్రేస్ అండ్ గ్లోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టామని “Celebrating Her Power, Grace & Glory” అంటే కేవలం మహిళను పొగడటం కాదు — ఆమె శక్తిని గుర్తించి, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించి, ఆమె విజయాలను సంబరంగా జరుపుకోవడం అనే విస్తృతమైన భావం ఇందులో ఇమిడి ఉందని ఆమె తెలిపారు. "
"మేము ఆధునిక మహిళలం నవదుర్గలం మేము నవశక్తులు మాలోనే"" అనే థీమ్ తో ఈ దసరాకు మహిళా సాంస్కృతి కోత్సవాలు అక్టోబర్ 4వ తారీఖున ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మాయిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.
రాజా పెంటపాటీ ట్రై నెట్ అమరావతి ఏపీ





